Homeహైదరాబాద్latest Newsస్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి

ఇదేనిజం, రాయికల్: జగిత్యాల జిల్లా, రాయికల్ మండల ప్రభుత్వ జూనీయర్ కళాశాలను పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు సందర్శించారు. విద్యార్థుల మరియు ఉపాద్యాయుల సమస్యలను తెలుసుకున్నారు. విద్యార్థులకు సమయానికి బస్ సౌకర్యం కల్పించే విధంగా అధికారులతో సూచిస్తానని అన్నారు. మోడల్ స్కూల్, ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులకు సమయానికి బస్ వచ్చేలా చేస్తానని తెలిపారు.

జూనియర్ కళాశాలలో విద్యార్థులు ఉపాద్యాయులతో స్వచ్చదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా చెట్లు నాటారు పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు చెట్టు నాటడమే కాకుండా వాటి సంరక్షణ కూడా చూడాలని అన్నారు. ప్రతి ఒక్కరు ఒక్క చెట్టు నటాలి దాని సంరక్షణ మన బాధ్యత అని తెలిపారు. కళాశాల లోని వాటర్ ప్లాంట్ పరిశీలించారు. వాటర్ ప్లాంట్ చిన్న చిన్న సమస్యలు ఉండడం తో మరమ్మతులు చేపిస్తనాని జీవన్ రెడ్డి గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు, మండల కాంగ్రెస్ అద్యక్షులు, కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img