Homeహైదరాబాద్latest Newsఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఫ్లెక్సీలు తొలగించిన అధికారులు.. నేతల ఫైర్

ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ఫ్లెక్సీలు తొలగించిన అధికారులు.. నేతల ఫైర్

జగిత్యాల పట్టణంలో కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఫ్లెక్సీలు తొలగించడం రగడకు దారితీసింది. ఎనిమిదవ వార్డులోని బేడ బుడగ జంగాల కాలనీలో బోనాల పండుగ సందర్భంగా జీవన్ రెడ్డి ఫోటోతో స్థానికులు ఫ్లెక్సీలను ఏర్పాటు చేయగా.. వాటిని మున్సిపల్ సిబ్బంది తొలగించారు. విషయం తెలుసుకున్న జీవన్ రెడ్డి.. 8వ వార్డుకు వచ్చి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానన్నారు.

Recent

- Advertisment -spot_img