- గ్లోబల్ లాజిక్ కంపెనీని కోరిన ఎమ్మెల్సీ కవిత
- కవితతో సంస్థ ప్రతినిధుల భేటి
mlc kavitha: ఇదేనిజం, హైదరాబాద్: నిజామాబాద్ ఐటీ హబ్ కు పెట్టుబడులు తీసుకొచ్చేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత క్రుషి చేస్తున్నారు. అక్కడి ఐటీ హబ్ లో పెట్టుబడులు పెట్టాలని ఆమె తాజాగా గ్లోబల్ లాజిక్ కంపెనీ ప్రతినిధులను కోరారు. సోమవారం సంస్థ వైస్ ప్రెసిడెంట్ గురు కమ కొలను, కంటెంట్ ఇంజనీరింగ్ విభాగం వైస్ ప్రసిడెంట్ కృష్ణ మోహన్ వీరవల్లి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో హైదరాబాద్ లో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు బాజీరెడ్డి గొవర్ధన్, షకీల్ కూడా పాల్గొన్నారు. కవిత విజ్ఞప్తిని పరిగణించిన ఆ కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా స్పందించారు. నిజామాబాద్ ఐటీ హబ్ పై సుదీర్ఘంగా చర్చించారు. అక్కడి రవాణా, నీరు, విద్యత్తు వంటి సౌకర్యాలతో పాటు శాంతి భద్రతపై కంపెనీ ప్రతినిధులకు కవిత వివరించారు. రవాణా సౌకర్యం విషయంలో ఆర్టీసీ బస్సులను ఐటీ హబ్ వరకు వేయించడానికి కృషి చేస్తానని బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ సెల్ గ్లోబల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల గుప్తా కూడా పాల్గొన్నారు.