– సుప్రీంకోర్టులో కవిత పిటిషన్
ఇదే నిజం, వెబ్ డెస్క్ : ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. నన్ను అక్రమంగా లిక్కర్ స్కాం కేసు అరెస్టు చేసారని, న్యాయస్థానంలో కేసు విచారణ జరుగుతుండగానే తనను అరెస్టు చేసినట్లు కవిత పేర్కొన్నారు. గతంలో విచారణ జరిగినప్పుడు సమన్లు జారీ చేయమని కోర్టుకు చెప్పి అక్రమంగా నన్ను అరెస్టు చేశారని కవిత పేర్కొన్నారు. కోర్టు ఆదేశాలను, ధిక్కరించినందుకు గాను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు సంస్థపై తగిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కవిత తరఫు న్యాయవాది ఆన్‌లైన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. అయితే దీనిపై మంగళవారం కోర్టులో విచారణ జరగనుంది.