ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఈడీ, సీబీఐ నమోదు చేసిన కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత వేసిన పిటిషన్‌లను ఢిల్లీ హైకోర్టు జులై 1న తిరస్కరిస్తూ తీర్పు వెలువరించింది. ఆ తీర్పును సవాల్ చేస్తూ శుక్రవారం సుప్రీంకోర్టులో కవిత బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. సోమవారం విచారణ జాబితాలో కవిత పిటిషన్ లిస్ట్ అయ్యింది. జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. కాగా, లిక్కర్ స్కామ్ కేసులో కవిత గత ఐదు నెలలుగా తిహార్ జైలులో ఉన్న విషయం తెలిసిందే.