Homeహైదరాబాద్latest NewsMalkajgiri ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ Shambipur Raju!

Malkajgiri ఎంపీ అభ్యర్థిగా ఎమ్మెల్సీ Shambipur Raju!

ఇదేనిజం, మేడ్చల్ బ్యూరో : మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థిగా మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును బీఆర్ఎస్ అధిష్టానం బరిలోకి దించుతున్నట్లు సమాచారం. తెలంగాణ భవన్‌లో మంగళవారం మేడ్చల్ జిల్లా ప్రజా ప్రతినిధులు, ముఖ్య నేతలతో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ విస్తృత స్థాయి ముఖ్యనేతల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజును ముఖ్యనేతలు ప్రతిపాదించగా కేసీఆర్ ఓకే చెప్పినట్లు విశ్వాసనీయ సమాచారం. ఒకటి రెండు రోజుల్లో బీఆర్ఎస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించనున్నట్లు తెలిసింది.

Recent

- Advertisment -spot_img