ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ వైసీపీ కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని.. శాంతిభద్రతలు పూర్తిగా క్షిణించాయంటు వైసీపీ ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలో ధర్నా కార్యక్రమం చేపట్టింది. అలాంటి కార్యక్రమానికి ఇద్దరు ఎమ్మెల్సీలు గైర్హాజరయ్యారని తెలుస్తోంది. తూమాటి మాధవరావు, వంకా రవీంద్ర ఇద్దరూ మంగళవారం మండలికి వచ్చారు. ఢిల్లీకి వెళ్లాల్సిన వీరిద్దరూ ఇలా మండలికి హాజరుకావడం ఆసక్తికరంగా మారింది.