MMTS: 4వ తేదీన హైదరాబాద్ నగరంలో 34 ఎంఎంటీఎస్ సర్వీసులను రద్దు చేశారు ఈ. విషయాన్ని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటన ద్వారా వెల్లడించారు.. పలు పనుల కారణంగా ఎంఎంటీఎస్ రైళ్లను రద్దు చేస్తున్నట్లు పేర్కొన్నారు. లింగంపల్లి – హైదరాబాద్ మధ్యలో 9 సర్వీసులు, హైదరాబాద్ – లింగంపల్లి మధ్య 9 సర్వీసులను రద్దు చేశారు. ఫలక్‌నూమా – లింగంపల్లి మధ్య ఏడు సర్వీసులు, లింగంపల్లి – ఫలక్‌నూమా మధ్య ఏడు సర్వీసులను రద్దు చేశారు. సికింద్రాబాద్ – లింగంపల్లి మధ్య నడిచే 47150 రైలు, లింగంపల్లి – సికింద్రాబాద్ మధ్య నడిచే 47192 రైలును కూడా రద్దు చేసినట్లు పేర్కొన్నారు .