Homeసైన్స్​ & టెక్నాలజీఆ మెసేజ్​ నమ్మితే ఇక అంతే..

ఆ మెసేజ్​ నమ్మితే ఇక అంతే..

కరోనా వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ కోసం ‘కొవిన్‌’ పోర్టల్‌ను సందర్శించే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతున్నది.

దీన్ని గమనించిన సైబర్‌ నేరగాళ్లు కొత్త కుట్రకు తెరలేపారు.

తమ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే కొవిడ్‌-19 వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ను సులభంగా చేసుకోవచ్చని ఓ మాల్‌వేర్‌ లింక్‌ను ఫోన్‌లకు ఎస్సెమ్మెస్‌గా పంపిస్తున్నారు.

ఆ లింక్‌పై క్లిక్‌ చేసిన పలువురు యూజర్ల ఫోన్లలోని కాంటాక్ట్‌ లిస్ట్‌ సైబర్‌ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్లినట్టు గుర్తించామని సెర్ట్‌ ఒక ప్రకటనలో తెలిపింది.

ఆండ్రాయిడ్‌ ఫోన్లే లక్ష్యంగా దాడులు జరుగుతున్నట్టు వెల్లడించింది.

Covid19.apk;Vaci__Regis.apk; MyVaccin_v2.apk; Cov-Regis.apk and Vccin-Apply.apk వంటి లింక్స్‌ పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ‘కొవిన్‌’ పోర్టల్‌ ద్వారానే టీకా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాలని సూచించింది.

Recent

- Advertisment -spot_img