చర్లపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల ఆధునీకరణ పనులు పూర్తి కాగా.. త్వరలో ప్రజలకు మరింత మెరుగైన సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. రూ.428 కోట్లతో చర్లపల్లి రైల్వే స్టేషన్‌లో కొత్త శాటిలైట్ టెర్మినల్‌తోపాటు ఆధునిక ప్రయాణీకుల సౌకర్యాలను కలిగి ఉంటుందని తెలిపారు. అటు హైదరాబాద్, సికింద్రాబాద్ స్టేషన్లలో రద్దీని తగ్గించడానికి కాచిగూడ స్టేషన్ సామర్ధ్యాన్ని పెంచామని ఆయన వివరించారు.