Homeఅంతర్జాతీయంmodi:జనంలోకి వెళ్లండి

modi:జనంలోకి వెళ్లండి

జనంలోకి వెళ్లండి

  • వారి సమస్యలు వినండి..
  • మందిర్‌ను నమ్ముకుంటే పని జరగదు
  • వచ్చే ఎన్నికల్లో గెలిచి తీరాలి
  • ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని మోడీ సూచన..

ఇదేనిజం, నేషనల్ బ్యూరో: ఎన్డీఏ ఎంపీలకు ప్రధాని మోడీ కొన్ని కీలక సూచనలు చేశారు. ఎంపీలంతా జనంలోకి వెళ్లాలని ఆదేశించారు. మందిర్ ను నమ్ముకుంటే ఓట్లు పడవని చెప్పినట్టు తెలుస్తోంది. కచ్చితంగా జనంలోకి వెళ్లాలని.. వారి సమస్యలను వినాలని సూచించినట్టు సమాచారం. ఎన్డీఏ పక్షాలకు చెందిన ఎంపీలతో ప్రధాని మోడీ తరుచుగా సమావేశాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజాగా మోడీ ఎంపీలకు కీలక సూచనలు చేశారు. ఇవాళ ప్రధాని మోడీ.. యూపీ ఎంపీలతో సమావేశమయ్యారు. రామమందిరం మినహా.. ఇతర సమస్యలపై ఎంపీలు దృష్టి సారించాలని సూచించారు. తరచూ ప్రజల్లోకి వెళ్లాలని, వారితో మమేకం అవ్వాలని, ప్రజలతో ఎక్కువ సమయం గడపాలని సూచించినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
ప్రజల మనసును గెలిచిన వారే ఎన్నికల్లో గెలుస్తారని ప్రధాని చెప్పినట్లు తెలుస్తోంది. ఎంపీలు తమ నియోజకవర్గాల్లోని స్థానిక సమస్యలపై మాట్లాడాలని, వివాహాలు, ఫంక్షలు ప్రజలు హాజరయ్యే కార్యక్రమాలకు వెళ్లాలని ఎంపీలకు సూచించినట్లు తెలుస్తోంది. 2024 విన్నింగ్ మంత్రను ఎంపీలకు వివరించారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజల్లో కోపం ఎక్కువగా ఉంటుందని, వారితో మాట్లాడాలని, పరిస్థితులను వివరించాలని, కోపంతో ఉన్న వారితో ఎక్కువ సమయం మాట్లాడి వారిని ఒప్పించాలని సూచించారు. ఎంపీలతో సమావేశంలో యూపీఏపై విమర్శలు గుప్పించారు ప్రధాని. యూపీఏ స్వార్థం గురించి ఆలోచిస్తే,, ఎన్డీఏ సంకీర్ణ ధర్మాన్ని పాటిస్తుందన్నారు. యూపీఏ మాదిరి కాకుండా ఎన్డీఏ త్యాగాలకు సిద్ధంగా ఉంటుందన్నారు.

రేపు దక్షిణాది ఎంపీలతో మోదీ సమావేశం
వరుస సమావేశాల్లో భాగంగా బుధవారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్‌ల నుంచి 96 మంది ఎంపీలతో ప్రధాని భేటీ అవుతారు. ఎన్డీఏ లక్ష్యాలు, ఎన్నికల వ్యూహాలు వివరిస్తారు. హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, బీజేపీ చీఫ్ జేపీ నడ్డా సహా పార్టీ సీనియర్ నేతలు ఈ సమావేశాల్లో భాగం కానున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్‌ (NDA)లో 38 పార్టీలకు చెందిన 430 మంది ఎంపీలను 11 గ్రూపులుగా విడదీసి విడి విడిగా సమావేశం అవుతున్నారు.

Recent

- Advertisment -spot_img