HomeతెలంగాణMODI:మీ కుటుంబానికి హృదయపూర్వక సానుభూతిగద్దర్​ భార్య విమలకు ప్రధాని మోడీ లేఖ

MODI:మీ కుటుంబానికి హృదయపూర్వక సానుభూతిగద్దర్​ భార్య విమలకు ప్రధాని మోడీ లేఖ

ఇదేనిజం, హైదరాబాద్​: ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన ప్రజాయుద్ధనౌక గద్దర్​ భార్యకు ప్రధాని మోడీ లేఖ రాశారు. ఈ లేఖలో ఆయన సంతాపం తెలిపారు. తీవ్ర దు:ఖంలో ఉన్న గద్దర్​ కుటుంబసభ్యులకు హృదయపూర్వక సంతాపం తెలుపుతున్నానని ఆయన లేఖలో పేర్కొన్నారు. గద్దర్ పాటలు, ఇతివృత్తాలు సమాజంలోని బడుగు బలహీన వర్గాలు ఎదుర్కొంటున్న సవాళ్లను ప్రతిబింబిస్తాయి. గద్దర్ రచనలు ప్రజలకు ప్రోత్సాహాన్ని కూడా అందించాయి. తెలంగాణ సాంప్రదాయక కళారూపాన్ని పునరుజ్జీవింపజేయడంలో ఆయన చేసిన కృషి ప్రజలకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మీ దుఖాన్ని మాటల్లో వ్యక్తపరచలేము. కుటుంబ సభ్యులకు, శ్రేయోభిలాషులకు ఈ దుఃఖాన్ని తట్టుకునే శక్తిని ప్రసాదించాలని కోరుకుంటున్నాను. ఓం శాంతి!’’ అంటూ ప్రధాని మోదీ లేఖలో పేర్నొన్నారు. కాగా.. ఈ నెల 6న ప్రముఖ విప్లవ కవి, ప్రజాగాయకుడు గద్దర్ కన్ను మూసిన విషయం తెలిసిందే.

Recent

- Advertisment -spot_img