Homeఅంతర్జాతీయంmodi:ఒకే వేదికపై మోడీ, పవార్

modi:ఒకే వేదికపై మోడీ, పవార్

ఒకే వేదికపై మోడీ, పవార్

  • ఇండియా కూటమిపై అనేక విమర్శలు

ఇదే నిజం, స్టేట్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఒకే వేదిక మీద కనిపించడం గమనార్హం. ప్రధాని మోడీకి పుణేలో లోకమాన్య బాలగంగాధర్‌ తిలక్‌ అవార్డు ప్రధానోత్సవం సందర్భంగా ఆసక్తికరమైన సన్నివేశం కన్పించింది. ఈ కార్యక్రమానికి ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ కూడా హాజరయ్యారు. దీంతో ఇండియా కూటమిలో ఉన్న శరదపవార్‌ .. ఎన్డీఏ కూటమికి దగ్గరవుతున్నారా..? అన్న అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే, ఇది రాజకీయ కార్యక్రమం కాదని.. దీన్ని ఆ కోణంలో చూడాల్సిన అవసరం లేదని పలువురు పేర్కొంటున్నారు. ఏడేళ్ల తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్‌సిపి) అధినేత శరద్ పవార్‌ ఒకే వేదికపై కన్పించారు.

Recent

- Advertisment -spot_img