నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్‌కు ఇది అర్థం కాలేదు: ప్రధాని మోదీ
ఫరీదాబాద్: గ్రామాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను అమలు చేయడం ఎంత ముఖ్యమో కాంగ్రెస్) పార్టీ తెలుసుకో లేకపోయిందని ప్రధాని మోదీవిమర్శించారు. రెండు రోజుల పాటు జరగనున్న భాజపా వీడియో కాన్ఫరెన్స్‌ను ఆయన సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ ప్రసంగిస్తూ.. కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.గ్రామాల్లో పంచాయతీరాజ్ వ్యవస్థను అమలుచేయడం ఎంతో ముఖ్యమని మోదీ అన్నారు. స్వాతంత్ర్యం వచ్చిన నాలుగు దశాబ్దాల్లో కాంగ్రెస్‌కు ఈ విషయం అర్థం కాలేదని ఎద్దేవా చేశారు. ఆ పార్టీ హయాంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఎలాంటి ప్రయత్నాలు జరగలేదని ఆరోపించారు. జిల్లా పంచాయతీ వ్యవస్థను కూడా కాంగ్రెస్ పట్టించుకోకుండా గాలికొదిలేసిందని దుయ్యబట్టారు. ప్రస్తుతం భారత్ లక్ష్యాలను, ‘అమృత్ కాల్’ తీర్మానాలను నెరవేర్చడానికి దేశం ఐక్యంగా ముందుకు సాగుతోందని అన్నారు. ఈ అమృత్‌కాల్‌లోని 25 ఏళ్ల ప్రయాణంలో గత దశబ్దాల అనుభవాలను గుర్తుచేసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.