బీజేపీ ఎంపీ నవనీత్ కౌర్ వ్యాఖ్యలను సీఎం రేవంత్ రెడ్డి తీవ్రంగా తప్పుబట్టారు. 15 సెకన్లలో దేశంలో ఉన్న ముస్లింలందర్నీ మట్టుబెడుతామనడం విధ్వంసాలకు పూనుకునే చర్యలకు సంకేతాలన్నారు. తెలంగాణలో శాంతిభద్రతల సమస్య సృష్టించి పెట్టుబడులను గుజరాత్‌కు తరలించేలా ప్రధాని మోదీ, అమిత్ షా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. గుజరాత్ పెట్టుబడిదారులు ఇందుకు సహకరిస్తున్నారని మండిపడ్డారు.