భారత్‌లోని నిరుద్యోగుల్లో 83 శాతం మంది యువతేనని ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ఐఎల్‌వో) రూపొందించిన ‘ఇండియా ఎంప్లాయ్‌మెంట్ రిపోర్ట్ 2024’పై కాంగ్రెస్ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్పందించారు.
నిరుద్యోగ టైం బాంబ్‌పై యువత కూర్చొన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నిరుద్యోగులను ప్రధాని మోదీ దారుణంగా మోసగించారని పేర్కొన్నారు. 2012తో పోల్చితే మోదీ ప్రభుత్వ హయాంలో నిరుద్యోగ యువత శాతం మూడు రెట్లు పెరిగిందన్నారు.