Modi : తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి న్యూఢిల్లీ నివాసంలో జరిగిన సంక్రాంతి సంబరాల్లో ప్రధాని నరేంద్ర మోదీ(Modi) , టాలీవుడ్ హీరో మెగాస్టార్ చిరంజీవి కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దీపం వెలిగించేందుకు నటుడు చిరంజీవి ప్రధాని మోదీతో కలిసి సంక్రాంతి సంబరాలు జరిపారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోడీతో చిరంజీవి కనిపించిన తర్వాత మళ్లీ మెగా రాజకీయాలు మొదలవుతాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. బీజేపీతో చిరంజీవి బంధం మరింత బలపడుతుందనే చర్చ కొద్దిరోజులుగా సాగుతోంది. చిరంజీవి సంక్రాంతిని ప్రధాని మోడీతో కలిసి జరుపుకోవడం చూసి చిరు మళ్లీ రాజకీయాల్లోకి రావడం ఖాయమంటున్నారు ఇప్పుడు నెటిజన్లు.