Homeహైదరాబాద్latest NewsModi Foreign Trips : ప్రధాని మోదీ విదేశీ ప‌ర్య‌ట‌న‌ల ఖ‌ర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Modi Foreign Trips : ప్రధాని మోదీ విదేశీ ప‌ర్య‌ట‌న‌ల ఖ‌ర్చు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

Modi Foreign Trips : ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 2022 మరియు డిసెంబర్ 2024 మధ్య 38 విదేశీ పర్యటనలకు దాదాపు రూ.258 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్ర ప్రభుత్వం గురువారం వెల్లడించింది. రాజ్యసభలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మల్లికార్జున్ ఖర్గే అడిగిన ప్రశ్నకు విదేశాంగ శాఖ సహాయ మంత్రి పబిత్ర మార్గెరిటా లిఖితపూర్వకంగా ఇచ్చిన సమాధానంలో ఈ గణాంకాలను అందించారు. ప్రధానమంత్రి మోడీ మే 2022 నుండి డిసెంబర్ 2024 వరకు 38 విదేశీ పర్యటనలు చేపట్టారని, వీటికి మొత్తం రూ. 258 కోట్లు ఖర్చు చేశారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ కాలంలో అత్యధిక ఖర్చు 2023 జూన్‌లో జరిగిన అమెరికా పర్యటనకే అని ఆయన అన్నారు. ఆ పర్యటనకు రూ. 22 కోట్లు ఖర్చు చేసినట్లు సమాచారం. అదేవిధంగా, సెప్టెంబర్ 2024లో జరిగిన మరో అమెరికా పర్యటనకు రూ. 15.33 కోట్లు ఖర్చు చేసినట్లు కేంద్రం తెలిపింది.

Recent

- Advertisment -spot_img