మంత్రి కోమటిరెడ్డికి సీఎం అయ్యే అర్హత ఉందంటూ నిన్న రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. ఆ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానని ఆయన చెప్పారు. రాష్ట్రానికి బీజేపీ చేసిందేమీ లేదన్నారు. కమీషన్ల కోసమే కేసీఆర్ కాళేశ్వరం కట్టారని ఆయన అన్నారు. రాష్ట్రానికి మోదీ తీరని అన్యాయం చేశారని.. ఓట్లు అడిగే హక్కు బీజేపీకి లేదన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్‌ఎస్‌కు మనుగడ లేదని ఆయన అన్నారు.