ఇదేనిజం, జగదేవపూర్: రానున్న లోకసభ ఎన్నికల్లో మోదీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని బీజేపీ సిద్ధిపేట జిల్లా నాయకులు గర్నెపల్లి కృష్ణమూర్తి ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ పదికి పైగా సీట్లను కైవసం చేసుకోవడం ఖాయం అని జోస్యం చెప్పారు. జగదేవ్‌పూర్ లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కమలం గుర్తుకు ఓటేసి బీజేపీ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. BRS, CONGRESS రెండూ ఒక్కటేనన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి స్కీం పేరుతో ప్రజలను మోసం చేస్తుందని, నేటికీ రుణమాఫీ చేయలేకపోవడమే అందుకు నిదర్శనం అన్నారు. లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతున్నా కనీసం పట్టించుకోవడంలేదని విమర్శించారు.