తెలంగాణలో రేవంత్‌రెడ్డి సర్కార్ చేపట్టిన కుల గణన సర్వే జరుగుతుంది. తెలంగాణలో జరుగుతున్న కులగణనపై రాహుల్ గాంధీ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘’మోదీ జీ తెలంగాణలో నేటి నుంచి కులగణన మొదలైంది. రాష్ట్రంలోని ప్రతి వర్గాల అభివృద్ధికి సంబంధించిన విధానాలను రూపొందించడానికి మేము దీని నుంచి పొందిన డేటాను ఉపయోగిస్తాము. త్వరలో మహారాష్ట్రలో కూడా ఇదే జరగనుంది. దేశంలో సమగ్ర కుల గణన చేపట్టడం బీజేపీకి ఇష్టం లేదన్న సంగతి అందరికీ తెలిసిందే.. నేను మోడీ జీకి స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను.. దేశవ్యాప్తంగా కుల గణనను మీరు ఆపలేరు అని అన్నారు. ఈ పార్లమెంట్‌లోనే కుల గణనను ఆమోదించి.. రిజర్వేషన్లపై 50% గోడను బద్దలు కొడతాం’ అంటూ రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.