Homeహైదరాబాద్latest Newsతెలంగాణలో మోదీ పర్యటన.. షెడ్యూల్‌ ఇదే!

తెలంగాణలో మోదీ పర్యటన.. షెడ్యూల్‌ ఇదే!

లోక్‌సభ ఎన్నికల ప్రచారానికి ప్రధాని మోదీ మరోసారి తెలంగాణకు రానున్నారు. మే 8, 10 తేదీల్లో ప్రధాని రాష్ట్ర పర్యటన ఖరారైంది. 8న వేములవాడ, వరంగల్ సభలకు మోదీ హాజరుకానున్నారు. 10న హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ప్రధాని పాల్గొంటారని బీజేపీ వర్గాలు తెలిపాయి. అలాగే ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని మోదీ మే 3, 4 తేదీల్లో ఏపీలో పర్యటించనున్నారు. ఈ నెల 3న పీలేరు, విజయవాడలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2.45 గంటలకు పీలేరు, సాయంత్రం 6.30 గంటలకు విజయవాడలో జరిగే రోడ్ షోలో పాల్గొంటారు. 4న రాజమండ్రి, అనకాపల్లిలో పర్యటించనున్నారు. కూటమి అభ్యర్థుల తరఫున ప్రధాని మోదీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

Recent

- Advertisment -spot_img