తెలుగు సీనియర్ నటుడు మోహన్ బాబు మీడియాకు బహిరంగంగా క్షమాపణలు చెప్పారు. మంచు ఫ్యామిలీలో గొడవలు జరుగుతున్న నేపథ్యంలో ఓ జర్నలిస్టుపై సినీ నటుడు మంచు మోహన్ బాబు దాడి చేసారు.అయితే దాడి ఘటనలో జర్నలిస్ట్‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ దాడిలో గాయపడిన జర్నలిస్ట్‌ను తాజాగా కలిశారు. యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్‌ను కలిసిన మోహన్ బాబు.. రంజిత్, ఆయన కుటుంబ సభ్యులకు మరోసారి బహిరంగంగా క్షమాపణలు చెప్పారు.