కుటుంబంలో నెలకొన్న పరిణామాలతో మోహన్ బాబు అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. ఆయనను పోలీసులు, సిబ్బంది ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. బీపీ ఎక్కువ కావటంతో మోహన్ బాబును స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. కాగా ‘మనోజ్ను కనడమే నేను చేసిన పాపమా’ అంటూ భావోద్వేగంతో మోహన్ బాబు ఆడియో విడుదల చేసిన విషయం తెలిసిందే.