నటుడు మోహన్ బాబు ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్ విడుదలైంది. మోహన్ బాబు ఎడమ కన్ను కింద గాయమైందని, బీపీ అధికంగా ఉందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. తీవ్ర ఆందోళనకు గురి కావడంతో పాటు బాడీ పెయిన్స్ సమస్యలున్నాయని వైద్యులు ప్రకటించారు. ప్రత్యేక వైద్యులతో ఆయనకు అత్యవసర చికిత్స అవసరమని వైద్యులు చెప్పారు. రక్తపోటు అధికమవడంతో ఎడమ కంటి సమస్య తలెత్తిందని, హార్ట్ రేట్ ఫ్లక్చువేట్ అవుతోందని తెలిపారు. వయస్సు, ఆరోగ్య దృష్ట్యా కార్డియాలజిస్ట్, న్యూరో, ప్లాస్టిక్ సర్జన్ల పర్యవేక్షణలో చికిత్స అవసరమని కాంటినెంటల్ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇంకో రెండు రోజుల పాటు మోహన్ బాబు ఆస్పత్రిలోనే ఉండాలన్నారు.