మంచు మోహన్ బాబు ఇంట్లో మరోసారి విబేధాలు భగ్గుమన్నాయి. అయితే మోహన్ బాబు, ఆయన కొడుకు మనోజ్ మధ్య ఆస్తి విషయంలో గొడవ జరిగి, ఒకరిపై ఒకరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసుకున్నారు. మనోజ్ గాయాలతో వచ్చి మరీ కంప్లైంట్ చేశారని ప్రచారం జరిగింది.. ఈ నేపథ్యంలో మంచు ఫ్యామిలీ స్పందించింది. తమ విషయంలో జరుగుతున్న ప్రచారంపై మోహన్ బాబు కుటుంబం స్పందించింది. వార్తలను ఖండించారు. తప్పుడు ప్రచారం చేయవద్దని వార్తలు రాసిన మీడియాకు సూచించింది.