Mohanlal : మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) హీరోగా నటించిన సినిమా ”L2E ఎంపురాన్”. ఈ సినిమాకి స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా 2019లో వచ్చిన ”లూసిఫర్” సినిమాకి సీక్వెల్ గా రానుంది. ఈ సినిమా మార్చి 27న థియేటర్లలో విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా తెలుగు హక్కులను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు సొంతం చేసుకున్నారు. ఈ సినిమాని తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు గ్రాండుగా రిలీజ్ చేయబోతున్నారు. గతంలో వచ్చిన ”లూసిఫర్” సినిమా ఘన విజయం సాధించింది. దాంతో ఇప్పుడు వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.