Mohanlal : మలయాళ సూపర్‌స్టార్ మోహన్‌లాల్ (Mohanlal) హీరోగా నటించిన సినిమా ‘L2E ఎంపురాన్’. ఈ సినిమాకి స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. మార్చి 27న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకి అద్భుతమైన స్పందన వస్తుంది. తాజాగా ఈ సినిమా వివాదంలో చిక్కుకుంది. ఈ సినిమాపై హిందీ సంఘాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయితే ఈ సినిమాని బ్యాన్ చేయాలనీ కొందరు డిమాండ్ చేస్తుంటే, సినిమాలో అభిమన్యు సింగ్ పాత్రను హిందుత్వ ఉగ్రవాదిగా చూపించినందుకు డైరెక్టర్ పృథ్వీరాజ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రముఖ రాజకీయ నాయకుడిని కించపరచడంతోపాటు బీజేపీ పార్టీని కూడా టార్గెట్ చేసే విధంగా ఉందని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు ఎల్ 2పై బీజేపీకి పార్టీకి చెందిన వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడిని విలన్‌గా చిత్రీకరించారని కొందరు సోషల్ మీడియా ద్వారా విమర్శిస్తున్నారు. అయితే ఈ విమర్శలపై చిత్రబృందం ఇప్పటి వరకు స్పందించలేదు.