హైదరాబాద్ : పాతబస్తీ డబీల్పురాలోని ముస్లిం షియా సోదరుల ప్రార్థనా స్థలం (బీబీకీ అలావా) వద్ద శుక్రవారం సౌత్ జోన్ డీసీపీ గజరావ్ భూపాల్ ఐపీఎస్ సందర్శించి అలంకు దట్టీలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్బంగా మీర్‌చౌక్ ఏసీపీ ఆనంద్, రైన్బజార్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ పారుపల్లి ఆంజనేయులు తన సిబ్బందితో కలిసి ప్రత్యేక బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రార్థనకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా అలావా ముతవల్లి పలు సౌకర్యాలు కల్పించారు