Homeహైదరాబాద్latest Newsకలెక్టరేట్ లో కోతుల హల్ చల్

కలెక్టరేట్ లో కోతుల హల్ చల్

– భయభ్రాంతులకు గురవుతున్న సందర్శకులు

ఇదే నిజం, కరీంనగర్ : కరీంనగర్ కలెక్టరేట్ లో కోతులు హల్ చల్ చేస్తున్నాయి. వేసవి కావడంతో నీళ్ల కోసం కార్యాలయాల్లోని బాత్రూంలు, ట్యాప్ ల వద్దకు వచ్చి నీళ్లు తాగుతూ సేద తీరుతున్నాయి. ఎండలు భగ్గుమంటుండడంతో కార్యాలయాల నుంచి కదలడం లేదు. కలెక్టరేట్ లో కలియదిరుతున్న వానరాలు సోమవారం ‘ఇదే నిజం’ కంటపడ్డాయి. జిల్లా నలుమూలల నుంచి వివిధ పనుల నిమిత్తం వచ్చే ప్రజలు కోతుల బెడదతో ఇబ్బందులు పడుతున్నారు. చేతుల్లో ఏమైనా కనిపిస్తే చాలు వారి పక్కనే తచ్చాడుతూ కోతులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. వానరాలు ఎప్పుడు, ఎటువైపు నుంచి దాడి చేస్తాయోనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలు, సందర్శకులే కాకుండా కలెక్టరేట్ లోని వివిధ కార్యాలయాల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది కూడా కోతుల సంచారంతో అవస్థలతో సతమతమవుతున్నారు.

Recent

- Advertisment -spot_img