ఇదే నిజం, శేరిలింగంపల్లి: పెళ్లికి నిరాకరించిందనే కక్ష్యతో యువతి పై ప్రేమోన్మాది కత్తితో దాడి చేయగా తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతిచెందిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్నది. ఈ ఘటనలో అడ్డుకోబోయిన ముగ్గురు స్నేహితురాల్లు సైతం తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వెస్ట్ బెంగాల్ కు చెందిన దీపన తమాంగ్ (25) నగరానికి వచ్చి గోపన్ పల్లిలో తన స్నేహితులతో కలిసి నివాసం ఉంటూ నల్లగండ్ల అపర్ణలో బ్యూటీషియన్ గా పని చేస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా కర్ణాటకకు చెందిన రాకేష్ తో పరిచయం ఏర్పడింది. ఈ క్రమంలో దీపన తమాంగ్ వెంట పడుతూ పెళ్లి చేసుకోవాలని వేధిస్తున్నాడు. అయితే ఆమె పెళ్లికి నిరాకరిస్తూ వస్తోంది. ఈ క్రమంలో బుధవారం రాత్రి దీపన ఇంటికి వెళ్లిన రాకేష్.. ఆమెతో వద్ద మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. రాకేష్ క్షణికావేశంలో అక్కడే ఉన్న కూరగాయల కత్తితో యువతి పై దాడి చేశాడు. ఈ దాడిలో దీపన తమాంగ్ తీవ్రయాలతో అక్కడికక్కడే మృతి చెందింది. అడ్డుకోబోయిన ముగ్గురు స్నేహితురాళ్ళకు గాయాలయ్యాయి. రాకేష్
మెయినాబాద్ పారిపోయి కనకమామిడి అనే ఊరిలో విద్యుత్ పోల్ ఎక్కి ఆత్మహత్య యత్నానికి పాల్పడగా తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు కనకమామిడి సమీపంలోని ఓ హస్పిటల్ కుతరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.