Homeజాతీయంకరోనా మరిన్ని వేవ్స్‌ రానున్నాయి

కరోనా మరిన్ని వేవ్స్‌ రానున్నాయి

కరోనా విజృంభణలో భాగంగా మరిన్ని వేవ్స్‌ విరుచుకుపడే ప్రమాదమున్నదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) చీఫ్‌ సైంటిస్ట్‌ సౌమ్యా స్వామినాథన్‌ హెచ్చరించారు.

మహమ్మారి కట్టడికి వచ్చే 6-18 నెలల సమయం అత్యంత కీలకమని సూచించారు.

ఓ ఇంగ్లీష్‌ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. దేశంలో వెలుగుచూసిన బీ.1.617 వేరియెంట్‌ తీవ్రమైనదని, వేగంగా వ్యాప్తి చెందుతుందన్నారు.

బ్రిటన్‌లో గుర్తించిన బీ 117 స్ట్రెయిన్‌ కంటే ఇది ఇంకా ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నదని పేర్కొన్నారు.

ప్రస్తుతం దేశంలో అందుబాటులో ఉన్న టీకాలు ఈ స్ట్రెయిన్‌పై సమర్థంగా పనిచేస్తుండటం ఊరట కలిగిస్తున్నదని పేర్కొన్నారు.

ప్రపంచంలోని కనీసం 30 శాతం మందికి టీకా వేసినట్లయితే మహమ్మారి తీవ్రతను తగ్గించినవారమవుతామని సౌమ్య అభిప్రాయపడ్డారు.

Recent

- Advertisment -spot_img