Homeహైదరాబాద్latest Newsఇరాన్ అధ్యక్షుని మరణం వెనక మొసాద్?

ఇరాన్ అధ్యక్షుని మరణం వెనక మొసాద్?

ఇరాన్ అధ్యక్షుడి మరణం వెనక ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘మొసాద్ ’ హస్తం ఉందని నెటిజన్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రమాదం కాదని, కచ్చితంగా మొసాద్ స్కెచ్ అని నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్స్, పోస్టులు పెడుతున్నారు. ఇటీవల, ఇరాన్.. ఇజ్రాయెల్‌పై డ్రోన్లు, క్షిపణుల వర్షం కురిపించిన విషయం తెలిసిందే. డమాస్కస్ లోని తమ దేశ రాయబార కార్యాలయంపై దాడి చేసి ఉన్నతాధికారులను చంపిందని ఆరోపిస్తూ ఇజ్రాయెల్ పై ఈ దాడులకు దిగింది ఇరాన్. ప్రస్తుతం రెండు దేశాల మధ్య వివాదం ముదురుతోంది. ఈ క్రమంలో ఇరాన్ అధ్యక్షుడి మృతి ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Recent

- Advertisment -spot_img