Homeహైదరాబాద్latest NewsMost Costly Director : ఇండియాలోనే మోస్ట్ కాస్ట్‌లీ డైరెక్టర్.. ఒక మూవీకి రూ.200 కోట్లు.....

Most Costly Director : ఇండియాలోనే మోస్ట్ కాస్ట్‌లీ డైరెక్టర్.. ఒక మూవీకి రూ.200 కోట్లు.. ఎవరో తెలుసా..?

Most Costly Director : భారతీయ సినిమా పరిశ్రమలో దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించారు. ‘బాహుబలి’ సిరీస్ మరియు ‘ఆర్.ఆర్.ఆర్’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన రాజమౌళి.. ఇప్పుడు దేశంలోనే అత్యధిక పారితోషికం అందుకునే దర్శకుడిగా నిలిచారు. ఒకే సినిమాకు రూ.200 కోట్ల పారితోషికం తీసుకుంటూ, భారతీయ సినిమా రంగంలో ఒక కొత్త రికార్డును సృష్టించారు.

రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘బాహుబలి’ భారతీయ సినిమా బాక్సాఫీస్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని రాశాయి. ఈ చిసినిమాలు త్రాలు దేశీయంగానే కాక, అంతర్జాతీయంగా కూడా భారీ వసూళ్లను రాబట్టాయి. ఆ తర్వాత ‘ఆర్.ఆర్.ఆర్’ (2022) సినిమాతో రాజమౌళి మరోసారి తన సత్తా చాటారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.1,300 కోట్లకు పైగా వసూలు చేసి, ఆస్కార్ అవార్డును కూడా అందుకుంది.
ప్రస్తుతం రాజమౌళి ఒక్కో సినిమాకు రూ.200 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు సమాచారం. ఇది భారతదేశంలోనే అత్యధిక పారితోషికంగా నిలిచింది. టాలీవుడ్‌తో పాటు, పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు తీస్తూ.. రాజమౌళి భారతీయ సినిమా పరిశ్ర మరియు హాలీవుడ్ దర్శకులు సైతం ఆయన్ను ప్రశంసించే స్థాయికి చేరుకున్నారు. రాజమౌళి తరువాత ఇతర దర్శకులైన సందీప్ రెడ్డి వంగా, ప్రశాంత్ నీల్ ఒక్కో సినిమాకు రూ. 90 కోట్లు, రాజ్‌కుమార్ హిరానీ రూ. 80 కోట్లు చార్జ్ చేస్తారని సమాచారం. ప్రస్తుతం రాజమౌళి సూపర్‌స్టార్ మహేష్ బాబుతో ఒక భారీ యాక్షన్ అడ్వెంచర్ సినిమాని రూపొందిస్తున్నారు. ఈ సినిమా మరోసారి రికార్డులను బద్దలు కొట్టే అవకాశం ఉంది.

Recent

- Advertisment -spot_img