Homeహైదరాబాద్latest NewsMost Popular : ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితా.. మొదటి స్థానంలో ఎవరంటే..?

Most Popular : ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన వ్యక్తుల జాబితా.. మొదటి స్థానంలో ఎవరంటే..?

Most Popular : 2025 సంవత్సరానికి భారతదేశంలో అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల జాబితా విడుదలైంది. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సంకలనం చేసిన 2025 నాటి టాప్ 100 అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితా విడుదలైంది. ఈ జాబితాలో ప్రధాని మోదీ అగ్రస్థానంలో ఉన్నారు. అమిత్ షా రెండో స్థానంలో నిలిచారు. విదేశాంగ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్ మూడో స్థానంలో నిలిచారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) నాయకుడు మరియు భారత రాజకీయాల్లో ప్రభావవంతమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన మోహన్ భగవత్ నాల్గవ స్థానంలో ఉన్నారు. లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ 9వ స్థానంలో ఉన్నారు.

ఈ జాబితాలో రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ చోటు దక్కించుకున్నారు. అదానీ గ్రూప్ ఛైర్మన్ గౌతమ్ అదానీ కూడా వ్యాపార రంగంలో తన ప్రభావం కారణంగా ప్రభావవంతమైన వ్యక్తిగా ఎదిగారు. ఈ జాబితాలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, మత పెద్దలు, సినీ ప్రముఖులు సహా అనేక రంగాలకు చెందిన వ్యక్తులు ఉన్నారు. క్రికెటర్లలో రోహిత్ శర్మ 48వ స్థానంలో, విరాట్ కోహ్లీ 72వ స్థానంలో, బుమ్రా 83వ స్థానంలో ఉన్నారు. ఈ జాబితాలో అలియా భట్ 100వ స్థానంతో చివరి స్థానంలో ఉంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అసదుద్దీన్ ఒవైసీ, తెలుగు స్టార్ హీరో అల్లు అర్జున్ అత్యంత శక్తివంతమైన భారతీయుల జాబితాలో చోటు సంపాదించారు. చంద్రబాబు నాయుడు 14వ స్థానం, రేవంత్ రెడ్డి 28వ స్థానం, పవన్ కళ్యాణ్ 73వ స్థానం, అల్లు అర్జున్ 92వ స్థానం సాధించారు.

Recent

- Advertisment -spot_img