ఇదే నిజం, కోరుట్ల : వివాహేతర సంబంధం మరో మహిళను బలి తీసుకుంది . ఇబ్రహీంపట్నంలోొని ఓ కుటుంబ సభ్యులకు తీరని శోకాన్ని మిగిల్చింది.
స్థానికుల కథనం ప్రకారం..
ఇబ్రహీంపట్నం మండలం తిమ్మాపూర్ కు చెందిన సింగం మమత (44) అనే వివాహిత ఎనిమిది నెలల క్రితం భర్తతో విడాకులు తీసుకుని స్వగ్రామం మెట్ పల్లి రాంనగర్ లో నివాసముంటోంది. తనకి పద్దెనిమిదేళ్ల కూతురు ఉంది. ఈ క్రమంలో ఒక ముస్లిం వ్యక్తితో మమతకు వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ అక్రమ సంబంధం ఇలా గుట్టుచప్పుడు కాకుండా కొనసాగుతున్న విషయం కూతురు పసిగట్టింది. తల్లి ప్రియుడు కూతురునీ లొంగదీసుకున్నాడు. తల్లీ-కూతుల్లిద్దరితో ఒకరికి తెలువకుండా ఒకరితో సంబంధం కొనసాగించాడు. అనూహ్యంగా అది మంగళవారం హత్యకు దారితీసింది.
తల్లిని చంపింది కూతురా? ప్రియుడా?
ప్రియుడిని నమ్ముకునే భర్తకు విడాకులు ఇచ్చి మెట్ పల్లి వచ్చిందని.. ఇక్కడ నమ్ముకున్న ప్రియుడే తన కూతురితో సంబంధం పెట్టుకున్న విషయం జీర్ణించుకోలేక సోమవారం(మే 21) రాత్రి తీవ్ర స్థాయిలో ఘర్షణ జరిగిందని వినిపిస్తున్నాయి. కాగా..తన కోసం పోలీసులు గాలిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న సదరు ప్రియుడు స్వచ్ఛందంగా మెట్ పల్లి పోలీసులకు లొంగిపోయాడని సమాచారం.
అయితే..తమ శారీరక సుఖానికి తల్లి అడ్డుగా వస్తోందని కూతురే తల్లి నిద్దట్లో ఉండగా కత్తితో పొడిచి చంపేసినట్టు పోలీసుల ఎదుట కూతురు చెప్పినట్టు తెలిసింది. ఇంతకూ చనిపోయిన తల్లి మమతను కత్తితో పొడిచి చంపింది కన్నకూతురా.? నమ్ముకుని వచ్చిన ‘కామన్’ ప్రియుడ అన్నది పోలీసుల దర్యాప్తులో తేలనుంది. ఏదిఏమైనా ఈ ‘ట్రయాంగిల్-అక్రమ సంబంధం’ ఉన్న హత్యోదంతం స్థానికంగా తీవ్రంగా చర్చానీయింశమైంది. పోలీసులు మమత మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.