Homeఅంతర్జాతీయంమరోసారి పేలిన ‘మౌంట్‌ సినాబంగ్‌’ అగ్నిపర్వతం

మరోసారి పేలిన ‘మౌంట్‌ సినాబంగ్‌’ అగ్నిపర్వతం

ఇండోనేషియా సుమత్రా దీవుల్లోని ‘మౌంట్‌ సినాబంగ్‌’ అగ్నిపర్వతం సోమవారం మరోసారి బద్దలైంది. దీని కారణంగా సుమారు ఐదు కిలోమీటర్ల ఎత్తు వరకు బూడిద, పొగ విస్తరించింది. పరిసర ప్రాంతాలన్నీ బూడిద తో నిండిపోయాయి. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం సంభవించ లేదని స్థానిక అధికారులు వెల్లడించారు. గత కొన్ని వారాలుగా సినాబంగ్‌ అగ్నిపర్వతం యాక్టివ్‌గా ఉందని, సోమవారం నాటి పేలుడు ఒక హెచ్చరిక లాంటిదని ఎవరూ రెడ్‌జోన్‌ ఏరియాలోకి పోవద్దని ఇండోనేషియా వోల్కనాలజీ, జియోలాజికల్‌ మిటిగేషన్‌ సెంటర్ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. మరోసారి అగ్పిపర్వతం విస్పోటనం చెందే అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు.
2010 నుంచి యాక్టివ్
దాదాపు 400 ఏళ్ల పాటు స్తబ్దుగా ఉన్న మౌంట్‌ సినాబంగ్‌ అగ్నిపర్వతం 2010 నుంచి క్రియాశీలకంగా మారిందని సైంటిస్టులు వెల్లడించారు. 2014లో ఒక సారి సంభవించిన విస్ఫోటనం కారణంగా దాదాపు 16 మంది మరణించారు. అదే విధంగా 2016 లోనూ జరిగిన విస్ఫోటనం లోనూ ఏడుగురు మృతి చెం దినట్లు అధికారులు చెప్పారు. జావా, సుమత్రా దీవుల్లో విస్తరించి ఉన్న ఈ అగ్నిపర్వతం పేలుడు ధాటికి 2018లో సముద్రంలో సునామీ చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ సునామీ కారణంగా పలు దేశాలకు చెందిన దాదాపు 400 మంది మృత్యువాత పడ్డట్లు అధికారులు గుర్తు చేస్తున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img