– ఎంపీ బండి సంజయ్
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: కరీంనగర్లోని మమత థియేటర్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ ‘రజాకార్’సినిమాను చూశారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కొంతమంది కుహన సెక్యులర్ వాదులు తెలంగాణ చరిత్రని మరుగున పెట్టారని ఆరోపించారు. నిజాం గొప్పవాడని కీర్తిస్తున్నారని తెలిపారు. నిజమైన చరిత్రని సమాజానికి అందించాలనే ఉద్దేశ్యంతో తీసిన సినిమా రజాకార్ అని బండి సంజయ్ తెలిపారు.కేసీఆర్ ఒక్కసారి ఈ రజాకార్ సినిమా చూసి నిజాం మంచోడు అని ట్వీట్ చేయాలని బండి సంజయ్ తెలిపారు. రజాకార్ వారసత్వ పార్టీ ఎంఐఎంతో కలిసిన వాళ్లు కేసీఆర్, కాంగ్రెస్ అని బండి సంజయ్ విమర్శించారు. చార్మినార్ వద్ద ఈ సినిమా ప్రదర్శించి.. ఒవైసీ బ్రదర్స్ని కట్టేసి ఈ సినిమా చూపెట్టాలని అన్నారు. కశ్మీర్ ఫైల్స్ లాంటి సినిమాల మాదిరిగా రజాకార్ ఫైల్స్ తీయాలని ఈ సినిమా డైరెక్టర్ గూడూరు నారాయణరెడ్డి సంకల్పించారన్నారు. అప్పటి ప్రభుత్వం అడ్డంకులు పెట్టినా సినిమాను ఆపలేదని బండి సంజయ్ తెలిపారు. భవిష్యత్లో కూడా ఇలాంటి సినిమాలు ఇంకా రావాలని.. ఆ దిశగా ఈ సినిమాను ప్రోత్సహించాల్సిందిగా తెలంగాణ సమాజాన్ని కోరుతున్నట్లు బండి సంజయ్ తెలిపారు.