ఈ ఏడాది ఇండియన్ సినిమా బాక్సాఫీసు వద్ద ఎన్నడూ లేని విధంగా స్టార్ హీరోల సినిమాలు బిగ్గెస్ట్ క్లాష్ కానున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన భారీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ‘సలార్’, బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన ‘డన్కి’సినిమాలు ఒక రోజు గ్యాప్‌లో రిలీజ్ కాబోతున్నాయి.దీంతో ఇది ఒక ఎపిక్ బాక్సాఫీస్ క్లాష్‌గా నిలవనుంది. అయితే, ఈ స్టార్ హీరోల సినిమాలకు హలీవుడ్ మోస్ట్ అవైటెడ్ మూవీ ‘ఆక్వామెన్–2’నుంచి పోటీ నెలకొంది. ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ డీసీ కామిక్స్ అండ్ వార్నర్ బ్రదర్స్ ప్రొడక్షన్లో తెరకెక్కించిన అవైటెడ్ సీక్వెల్ ‘ఆక్వా మెన్–2’. మొదట ఈ మూవీ రిలీజ్‌ను డిసెంబర్ 20కి ఫిక్స్ చేశారు. కానీ ఇపుడు 22కు షిఫ్ట్ చేసినట్లుగా మేకర్స్ కన్ఫార్మ్ చేశారు. దీంతో డిసెంబర్ 20న ఆక్వామెన్–2,21న డన్కి, 22న సలార్ ఇలా ఈ మూడు సినిమాలు ఒకరోజు గ్యాప్‌లో వరల్వైడ్గా రిలీజ్ కానుండటంతో మరింత పోటీ నెలకొంటుందనే చెప్పాలి. మెయిన్‌గా సలార్ రిలీజ్ డేట్ బాగా ఎఫెక్ట్ ఉంటుంది అని చెప్పొచ్చు. మరి
ఏ మూవీ కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తోందో వేచి చూడాలి.