ఇదే నిజం, గొల్లపల్లి: ధర్మపురి నియోజకవర్గ అభివృద్ధి ప్రధాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి,పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ పుట్టినరోజు సందర్భంగా దుబాయ్ లో ఉపాధి పొందుతున్న జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం శ్రీ రాములపల్లె గ్రామ వాస్తవ్యులు, అలాగే పరిసర ప్రాంత అభిమానులు దుబాయ్ శ్రీ రాములపల్లె ఈశ్వరన్న సైన్యం ఆధ్వర్యంలో ప్రియతమా నాయకులు కొప్పుల ఈశ్వరన్న పుట్టినరోజు సందర్భంగా దుబాయ్ లో కేకు కట్ చేసి ఈశ్వరన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈశ్వరన్న ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆభగవంతుణ్ణి కోరుకుంటూ, రానున్న రోజుల్లో ఉన్నతమైన పదవిలో ఉండాలని కోరుతూ, ఎల్లప్పుడూ మీ వెంటే మేము ఉంటామని ఈశ్వరన్న నాయకత్వం వర్ధిల్లాలి అని నినాదాలు చేశారు.