హైదరాబాద్‌లోని చైతన్యపురి డివిజన్ పరిధిలోని మూసీ నిర్వాసితులతో బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ ఈరోజు సాయంత్రం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మూసీ పరివాహక ప్రాంతంలోని వారి సమస్యలను తెలుసుకున్నారు. స్థానికులతో కలిసి ర్యాలీ కూడా చేపట్టారు. ఈ సందర్భంగా బాధితులు తమ బాధలను ఈటల రాజేందర్‌తో చెప్పుకున్నారు. మీ పోరాటం వల్లే మా ఇళ్లు ఇప్పటికీ ఉన్నాయి. అయితే ఇళ్లు కోల్పోతామనే ఆందోళనలో ఉన్నమ్మన్నారు. మూసీ సుందరీకరణ కంటే మా ఇళ్లు మాకు ముఖ్యమని ఈటలతో చెప్పారు. కోట్లాది రూపాయలు ఇచ్చినా… ప్రాణం పోయినా ఇళ్ల నుంచి కదిలేది లేదన్నారు.