Homeరాజకీయాలుపటేల్ రమేశ్​ రెడ్డికి ఎంపీ టికెట్​

పటేల్ రమేశ్​ రెడ్డికి ఎంపీ టికెట్​

– కాంగ్రెస్​ హైకమాండ్ హామీకి ఒకే చెప్పి రమేశ్​ రెడ్డి
– నామినేషన్​ ఉపసంహరణ
– పార్టీ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నానంటూ బోరున విలపించిన పటేల్

ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: సూర్యాపేట అసెంబ్లీ స్థానానికి ఆల్‌ ఇండియా ఫార్వార్డ్‌ బ్లాక్‌ పార్టీ అభ్యర్థిగా నామినేషన్‌ దాఖలు చేసిన కాంగ్రెస్ రెబల్ నేత పటేల్‌ రమేశ్‌రెడ్డి తన నామినేషన్‌ను విత్ డ్రా చేసుకున్నారు. కాంగ్రెస్‌ నుంచి బీఫాం దక్కకపోవడంతో ఆయన రెబల్​గా నామినేషన్‌ వేశారు. దీంతో దామోదర్‌రెడ్డి గెలుపు అవకాశాలను రమేశ్‌రెడ్డి ప్రభావితం చేస్తారనే ఉద్దేశంతో హస్తం పార్టీ రంగంలోకి దిగి బుజ్జగింపు ప్రయత్నాలు చేసింది. తొలుత పటేల్‌ రమేశ్​రెడ్డి ఇంటికి ఏఐసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి, రోహిత్‌ చౌదరి వెళ్లారు. ఈ క్రమంలో కొన్ని నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్‌ ఉపసంహరించుకునేది లేదని, అవసరమైతే దామోదర్‌రెడ్డిని పోటీ నుంచి తప్పించాలని రమేశ్‌రెడ్డి వర్గీయులు డిమాండ్‌ చేశారు. చర్చలు జరుగుతున్న గది వైపు రాళ్లు విసిరారు. మల్లురవి, రోహిత్‌ చౌదరిలను బయటకు వెళ్లనివ్వకుండా తాళం వేసే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ నేతలు కేసీ వేణుగోపాల్‌, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డితో మల్లు రవి, రోహిత్‌ చౌదరి చర్చించారు. అనంతరం రమేశ్‌రెడ్డికి ఎంపీ టికెట్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. దాంతో ఆయన కాస్త చల్లబడ్డారు. నామినేషన్‌ విత్ డ్రాకు అంగీకరించారు. ఈ సందర్భంగా పటేల్‌ రమేశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కన్నీరుమున్నీరుగా విలపించారు. పార్టీ కోసమే తాను ఈ నిర్ణయం తీసుకుంటున్నానని ప్రకటించారు.
మల్లురవిని అడ్డుకున్న పటేల్ అనుచరులు
అంతకుముందు పటేల్ రమేశ్​ రెడ్డిని బుజ్జగించేందుకు సూర్యాపేటలోని ఆయన ఇంటికి ఏఐసీసీ సీనియర్‌ ఉపాధ్యక్షుడు మల్లు రవి, రోహిత్‌ చౌదరి వెళ్లారు. ఈ నేపథ్యంలో పటేల్‌ రమేశ్ రెడ్డి వర్గీయులు వారిని అడ్డుకున్నారు. నామినేషన్‌ ఉపసంహరించుకునేది లేదని, అవసరమైతే కాంగ్రెస్‌ నుంచి నామినేషన్‌ వేసిన దామోదర్‌రెడ్డిని పోటీ నుంచి తప్పించాలని డిమాండ్‌ చేశారు. పటేల్‌ రమేశ్ రెడ్డితో గదిలో మాట్లాడుతుండగా ఆయన వర్గీయులు చర్చలు జరుగుతున్న రూమ్​ వైపు రాళ్లు విసిరారు. మల్లురవి, రోహిత్‌ చౌదరిలను బయటకు వెళ్లనివ్వకుండా తాళం వేసే ప్రయత్నం చేశారు. అయితే, ఎట్టకేలకు చర్చలు సఫలం కావడం, ఎంపీ టికెట్ ఇస్తామని హైకమాండ్ హామీ ఇవ్వడంతో పటేల్ రమేశ్ రెడ్డి నామినేషన్​ను విత్ డ్రా చేసుకున్నారు.

Recent

- Advertisment -spot_img