ఇదే నిజం,వేమనపల్లి: వేమనపల్లి మండలంలోని మంగనపల్లి గ్రామ సమీపంలో ఉన్న సమ్మక్క సారలమ్మలను శుక్రవారం రోజున నీల్వాయి ఎంపీటీసీ ఆర్ సంతోష్ కుమార్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సయ్యద్ సాబీర్ అలీ దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. వీరితో మాజీ సర్పంచ్ గాలి మధు, బొద్దున శంకర్, ఆవులమరి దుర్గక్క(పున్నం)ఇగురం జగన్, తోకల రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.