అశ్విని నుండి రేవతి వరకు మనకున్న 27 నక్షత్రాలలో సూర్యుని ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయించబడుతుంది. భారతీయ జ్యోతిష్య సంప్రదాయం ప్రకారం.. ప్రకృతిలో మార్పులు ఒక్కో కార్తెలో ఒక్కో విధంగా జరుగుతాయి. ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలో ప్రవేశించినప్పటి నుంచి నైరుతి రుతుపవనాలు వస్తాయి. చంద్రుడు ఒక్కో నక్షత్రం సమీపంలో 14 రోజులు ఉంటాడు. మృగశిర నక్షత్రానికి చంద్రుడు చేరువలో ఉండటంతో దీనికి మృగశిర అనే పేరు వచ్చింది. ఇక ఈ కార్తె అంటేనే చల్లదనం. వర్షాలు కూడా పడటంతో, రైతులు ఆనందంగా తమ పంట పనులు మొదలు పెట్టుకుంటారు. చల్లదనం నుంచి బయటపడటానికి బెల్లంలో ఇంగువ కలుపుకొని తినడం, చేపలు తినడం చేస్తుంటారు.