Homeతెలంగాణఏసిబికి చిక్కిన కీసర తాసీల్దార్

ఏసిబికి చిక్కిన కీసర తాసీల్దార్

హైదరాబాద్‌లోని ఏఎస్ రావు నగర్‌లో లంచం తీసుకుంటూ ఓ ఎమ్మార్వో రెడ్ హ్యాండెడ్‌గా పోలీసులకు దొరికిపోయారు. ఓ భూమికి సంబంధించి రూ.1.10 కోట్ల లంచం తీసుకుంటుండగా, కీసర ఎమ్మార్వో నాగరాజును ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏఎస్ రావు నగర్‌లోని తన నివాసంలోనే ఆయన లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. దీంతో వెంటనే నాగరాజు ఇల్లు, ఆఫీసులో ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఇంత భారీ ఎత్తున లంచం తీసుకుంటూ ఓ ఎమ్మార్వో పట్టుబడడం పెద్ద సంచలనంగా మారింది. కీసర ఎమ్మార్వో పరిధిలోకి వచ్చే రాంపల్లిలో 28 ఎకరాల భూమికి సంబంధించి వివాదం ఉన్నట్టు తెలిసింది. ఆ భూ వివాదాలకు క్లియర్ చేసేందుకు నాగరాజు భారీ ఎత్తున లంచం డిమాండ్ చేసినట్టు భావిస్తున్నారు. ఈ రోజు రూ.1.10 కోట్ల లంచం తీసుకుంటుండగా ఏఎస్ రావు నగర్‌లోని ఆయన నివాసంలోనే ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img