Mrunal Thakur : స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉంది. తెలుగు సినిమా పరిశ్రమలో వరుస హిట్లతో స్టార్ స్టేటస్ సంపాదించిన ఈ భామ, బాలీవుడ్‌లో మాత్రం ఇప్పటివరకు పెద్దగా సక్సెస్ అందుకోలేదు. అయినప్పటికీ తెలుగు సినిమాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుని, బాలీవుడ్‌లో కూడా కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటోంది.
మృణాల్ ఠాగూర్ తెలుగు సినిమాల్లో తనదైన ముద్ర వేసింది. 2022లో వచ్చిన “సీత రామం” సినిమాతో ఆమె సీత మహాలక్ష్మిగా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలిచి, ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందాయి. ఆ తరువాత “హాయ్ నాన్న” సినిమాతో మరోసారి తన నటనా సత్తాను చాటింది. ఈ రెండు సినిమాలు ఆమెను తెలుగు సినిమా పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా నిలబెట్టాయి.
అయితే బాలీవుడ్‌లో మృణాల్‌కు అంత సులభంగా సక్సెస్ దక్కలేదు. “సూపర్ 30”, “బాట్లా హౌస్”, “జెర్సీ” వంటి సినిమాల్లో ఆమె నటనకు మంచి మార్కులు పడినప్పటికీ, ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడలేదు. “జెర్సీ” సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకున్నా, కమర్షియల్‌గా విజయం సాధించలేకపోయింది. ఈ ప్లాప్‌లు ఆమె బాలీవుడ్ కెరీర్‌కు సవాలుగా నిలిచాయి. అయితే మృణాల్ ఠాగూర్ తెలుగు సినిమాల్లో సాధించిన విజయాలతో బాలీవుడ్‌లో వరుస ఆఫర్లు కొట్టేస్తుంది.