Homeస్పోర్ట్స్ర‌పేల్ వ‌చ్చినా.. నాకు సుఖోయ్ అంటేనే ఇష్టంః ధోనీ

ర‌పేల్ వ‌చ్చినా.. నాకు సుఖోయ్ అంటేనే ఇష్టంః ధోనీ

దుబాయి‌: భారత వైమానిక దళంలో ర‌ఫేల్ యుద్ధ విమానాలు అధికారికంగా చేరినందుకు టీమ్‌ఇండియా క్రికెట‌ర్ ఎంఎస్‌ ధోనీ ఇండియ‌న్ ఎయిర్‌ఫోర్స్ కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. ర‌ఫేల్‌ చేరికతో వాయుసేన శక్తి సామర్థ్యాలు రెట్టింప‌వుతాయ‌ని ట్విట‌ర్ ద్వారా తెలియ‌జేశారు. ర‌ఫేల్ అందుకున్న 17వ స్క్వాడ్రన్‌ (గోల్డెన్‌ యారోస్‌)కు అభినందనలు తెలిపాడు. మిరేజ్‌ 2000 సేవా రికార్డులను రఫేల్‌ బద్దలు కొడతాయనే న‌మ్మ‌కం ఉంద‌న్నారు. నాకు మాత్రం సుఖోయ్‌ 30ఎంకేఐ ఎప్పటికీ ఇష్ట‌మ‌న్నారు. ఇవి సూపర్‌ సుఖోయ్‌గా అవ్వాల‌ని ధోనీ ఆశించారు. ప్ర‌స్తుతం ధోనీ టెరిటోరియల్‌ ఆర్మీలో గౌరవ లెఫ్ట్‌నెంట్‌ కర్నల్‌ హోదాలో పనిచేస్తున్న సంగతి తెలిసిందే. ఏడాదిలో రెండు నెల‌లు ధోనీ ఆర్మీలో విధులు నిర్వ‌హిస్తాడు. గతంలో పద్మభూషణ్‌ పురస్కారాన్ని సైతం సైనిక దుస్తుల్లోనే అందుకోవ‌డం ఆర్మీపై అత‌నికి ఉన్న అభిమానాన్ని తెలియ‌జేస్తుంది.

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img