MS Dhoni: లక్నోతో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోని తన ప్రవర్తనతో అభిమానులను ఆకట్టుకున్నాడు. లక్నోలోని ఏకానా స్టేడియంలో CSK vs LSG మ్యాచ్ ముందు, ధోనీ రోబో డాగ్‌తో సరదాగా ఆడాడు.రోబో డాగ్ ను ఎత్తి, కింద పడుకోబెట్టాడు, దీంతో రోబో కదలలేకపోయింది. ఈ సంఘటన అందరినీ నవ్వించింది. ఈ ఘటన ధోనీ యొక్క చిలిపి స్వభావాన్ని, 43 ఏళ్ల వయసులోనూ అతని యవ్వన ఉత్సాహాన్ని చూపించిందని అభిమానులు సంబర పడుతున్నారు. IPL 2025లో కొత్తగా పరిచయం చేసిన రోబో డాగ్ (కెమెరాతో కూడిన రోబోట్) మైదానంలో తిరుగుతూ ఆటగాళ్లను, శిక్షణ సెషన్‌లను రికార్డ్ చేస్తున్న సంగతి తేలిసిందే.