Mukesh Ambani : రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ (Mukesh Ambani) భారతదేశంలోని అత్యంత ధనవంతులలో ఒకరు. రిలయన్స్ గ్రూప్ కింద అనేక కంపెనీలను నడుపుతున్న ప్రఖ్యాత భారతీయ వ్యాపారవేత్త. కానీ ఈ సంవత్సరం అతను ప్రపంచంలోని టాప్ పది ధనవంతుల జాబితా నుండి తప్పుకున్నాడు.
ఇటీవల హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ ఒక నివేదికను విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం, ముఖేష్ అంబానీ సంపద గత సంవత్సరంతో పోలిస్తే లక్ష కోట్లు తగ్గింది, దీంతో ఆయన టాప్ టెన్ ధనవంతుల జాబితా నుండి తపుకున్నారు. ఈ నష్టానికి ప్రధాన కారణాలు రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంధన మరియు రిటైల్ విభాగాలలో నష్టాలు, పెట్టుబడిదారుల ఆందోళనలు మరియు రుణ సమస్యలు అని తెలుస్తుంది.
2025 గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ ప్రపంచంలోని అత్యంత ధనవంతుడి స్థానాన్ని పొందారు. ఈ సంవత్సరం ఎలాన్ మస్క్ సంపద 82% పెరిగి దాదాపు $420 బిలియన్లకు చేరుకుంది. అంటే భారత కరెన్సీలో ఈ మొత్తాన్ని 3.5 లక్షల కోట్ల రూపాయలు అని చెప్పవచ్చు. ప్రపంచంలోని అత్యంత ధనవంతులలో ఇది అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక స్థితి. HCL టెక్‌కు చెందిన రోష్ని నాడార్ భారతదేశంలోని మొదటి టాప్ టెన్ ధనవంతురాలైన మహిళగా నిలిచారు. శివ్ నాడార్ వాటాలలో 47% పొందిన తర్వాత, ఆయన మొత్తం సంపద రూ.3.5 లక్షల కోట్లకు చేరుకుంది. దీంతో ఆమె ప్రపంచంలోనే ఐదవ ధనవంతురాలైన మహిళగా నిలిచింది.