Homeహైదరాబాద్latest Newsముఖేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి… అతిథులకు బహుమతులుగా తెలంగాణ హస్తకళ ఉత్పత్తులు..!

ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి… అతిథులకు బహుమతులుగా తెలంగాణ హస్తకళ ఉత్పత్తులు..!

ముఖేశ్ అంబానీ ఇంట పెళ్లి సందడి షూరూ అయింది. ముఖేష్ అంబానీ- నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ ఓ ఇంటివాడు కాబోతున్న సంగతి తెలిసిందే. రాధికా మర్చంట్‌‌తో వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ సందర్భంగా అంబానీ పెళ్లి వేడుకకు విచ్చేసే దేశ విదేశాలకు చెందిన అతిథులకు బహుమతులుగా చేనేత హస్తకళా రూపాలను ఇవ్వనున్నారట. ఇందుకోసం తెలంగాణ హస్తకళ కరీంనగర్ ఫిలిగ్రీ ఉత్పత్తులను అంబానీ ఆర్డర్ చేసినట్లు తెలుస్తోంది. వెండి తీగతో ఇక్కడి కళాకారులు వస్తువుల్ని రూపొందిస్తారు. గతేడాది జీ20 సదస్సుకు అశోకచక్రంతో కూడిన బ్యాడ్జీలను ఇక్కడి నుంచే పంపారు. అయితే వీరి వివాహం రెండు దేశాల్లో జరగనుంది. మే 29న ఇటలీలో ప్రారంభమైన వివాహ వేడుక జూన్ 1న స్విట్జర్లాండ్‌లో ముగియనుంది.

Recent

- Advertisment -spot_img